గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఆశించిన స్థాయిలో అభ్యర్థుల
విజయనగరం అర్బన్/గంటస్తంభం:
జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే అభ్యర్థుల హాజరు శాతం తగ్గింది. పరీక్షకు 84.69 శాతం అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన వారికి ఒక పోస్టుకు వంద మంది వంతున ఈ పరీక్షకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. నిజానికి ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్‌కు హాజరు కాకపోవడం సహజంగా ఉండదు. కానీ జిల్లాలో సుమారు 16 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా ఈ పరీక్షల నిర్వహణపై నెలకొన్న సందిగ్దతత వల్ల ఈ పరిస్థితి నెలకొందని పలువు రు అభిప్రాయపడుతున్నారు. చివరి క్షణం వరకు పరీక్ష వాయిదా పడుతుందని, దానికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడంతో దూర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులు అలా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. అయితే పరీక్ష వాయిదా పడదు.. ఆ వార్త ఫేక్.. పరీక్ష యధావిధిగా జరుగుతుందని ఒక్క రోజు ముందు పబ్లిక్ కమిషన్ ప్రకటించింది. దీంతో దూర ప్రాం
చివరి వరకూ అభ్యర్థుల్లో గందరగోళం
ప్రశాంతంగా ముగిసిన పరీక్ష
అభ్యర్థుల హాజరు శాతం 84.69 మాత్రమే..
కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ సేతుమాధవన్
తాల్లో ఉన్న అభ్యర్థులు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో హాజరు శాతం తగ్గిందని అభ్యర్థులు పేర్కొన్నారు. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లోని శిక్షణ పొందుతూ విజయనగరంలో పరీక్ష కేంద్రాలున్న అభ్యర్థులు రావడానికి శనివారం రాత్రికి రాత్రి ఇబ్బంది పడ్డారు. గాజులరేగకు చెందిన ఒక అభ్యర్థి హైదరాబాద్ నుంచి శనివా రం రాత్రి 11.30గంటలకు విజయనగరం చేరుకొని స్థానిక మహరాజా కళాశాల పరీక్ష కేంద్రంలో పరీక్ష రాశారు. ఇలా ఇబ్బంది పడి పరీక్షకు హాజరైన వారు అన్ని కేంద్రాల్లో కనిపించారు.
అభ్యర్థుల హాజరు శాతం 84.69 మాత్రమే...
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 12 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ – 2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండు పేపర్లకు ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో మెయిన్స్‌కి అర్హత పొందిన 6,265 మంది అభ్యర్థులలో 84.69 శాతంతో 5,306 మంది పరీక్షకు హాజరయ్యారు. గైర్హాజరు అయిన వారు 959 మంది ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా యంత్రాంగం పరీక్షల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి. పట్టణంలోని జేఎన్‌టీయూ జీవీ యూనివర్సిటీ, సీతం ఇంజనీరింగ్ కేంద్రాలను సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్ పరిశీలించారు. ఆయనతో పాటు డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు ఆశించిన స్థాయిలో అభ్యర్థుల
Comments
Please login to add a commentAdd a comment