కట్టుదిట్టమైన భద్రత
విజయనగరం క్రైమ్: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆదివారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. 12 కేంద్రాల్లో 180 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో పలు విద్యార్థి సంఘాలు రోస్టర్ విధానాన్ని ప్రకటించాక పరీక్ష నిర్వహించాలంటూ కోట వద్ద ధర్నా జరిపిన నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. నగరంలో జేఎన్టీయూ, సీతం, ఎంవీజీఆర్‌జీ, చైతన్య, ఆర్‌కే, గాయత్రి, ఎంఆర్ కళాశాల, లెండీ కళాశాల ఇలా ఏడు రూట్లుగా విభజించి ఒక్కో రూటుకు ఒక్కో సీఐని పర్యవేక్షణ అధికారిగా నియమించి భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. మొత్తంగా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందల్ ప్రకటించారు.
కట్టుదిట్టమైన భద్రత
Comments
Please login to add a commentAdd a comment