బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే జాతరకు వచ్చే లక్షలాది మంది యాత్రికులు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవాదాయశాఖతో పాటు ఇతర శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశాయి. తాగునీరు, విశ్రాంతి షెల్టర్లు, ప్రత్యేక క్యూలు, మరుగుదొడ్ల నిర్వహణ, రవాణా తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సేవలందించేందుకు సిద్ధమయ్యాయి. గత ఏడాదిలా ఈ సారి కూడా సుమారు లక్షకు పైగా భక్తులు రావచ్చునని పోలీస్, దేవాదాయ, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి 30 ఆర్టీసీ బస్సులు, విజయనగరం నుంచి 40 ఆర్టీసీ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment