
బైక్, వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి
● ఇద్దరికి గాయాలు
రామభద్రపురం: మండలంలోని కొండకెంగువ వద్ద సోమవారం వ్యాన్, ద్విచక్రవాహనం ఢీ కొనగా జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొండకెంగువ గ్రామానికి చెందిన బెవర లక్ష్మణ(40),బెవర కృష్ణ,బెవర గురుమూర్తి కలిసి వారి కళ్లం నుంచి ఆవుపాలు పట్టుకుని ద్విచక్రవాహనంపై గ్రామంలోకి వెళ్తున్నారు. ఇంతలో అదే గ్రామం నుంచి రామభద్రపురం వైపు వస్తున్న వ్యాన్ వారి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో లక్ష్మణకు, తమ్ముడు కృష్ణకు తీవ్రగాయాలవగా గురుమూర్తికి స్వల్పగాయమైంది. స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం ముగ్గురిని రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాడంగి సీహెచ్‌సీకి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో లక్ష్మణ చికిత్స పొంందుతూ మృతిచెందాడు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఎస్సై వి.ప్రసాదరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద విషయాలు తెలుసుకుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు లక్ష్మణకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పోక్సో కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష
తెర్లాం: పోక్సో కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ విజయనగరం పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.నాగమణి సోమవారం తీర్పు వెలువరించినట్లు బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని తమ్మయ్యవలస గ్రామానికి చెందిన బొమ్మాళి అనిల్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించాడు. ఆ యువతి పెళ్లి చేసుకోమని కోరగా తిరస్కరించడంతో 2019లో తెర్లాం పోలీస్‌స్టేషన్‌లో అనిల్‌పై పోక్సో కేసు నమోదైంది. దీనిపై అప్పటి తెర్లాం ఎస్సై నవీన్‌పడాల్ కేసు నమోదు చేయగా, బొబ్బిలి రూరల్ సీఐ బీఎండీ ప్రసాద్ కేసు దర్యాప్తు చేశారు. కేసు విచారణ అనంతరం న్యాయమూర్తి పై విధంగా తీర్పు వెలువరించారు.
రెండు కేసుల్లో ఇద్దరికి
6 నెలల జైలుశిక్ష
గంట్యాడ: రెండు కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఎస్సై సాయికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం 2018వ సంవత్సరంలో మండలంలోని లక్కిడాం గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్తున్న మహిళను అడ్డగించి మెడలో రెండున్నర తులాల పుస్తెలతాడును లాక్కుపోయిన కేసులో, జగ్గాపురంలో రాత్రి ఇంట్లో ప్రవేశించి పుస్తెలతాడు దొంగలించిన కేసులో గుమ్మడి సురేష్, కోమటిపల్లి శ్రీను అనే వ్యక్తులకు విజయనగరం స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ బుజ్జి పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసుల్లో ప్రాసిక్యూషిన్ తరఫున శాంతిగౌతమి వాదించారు.
రేకులషెడ్డు కూల్చివేతలో
ఇరువర్గాలపై కేసు
బొండపల్లి: మండలంలోని గొల్లలపేట గ్రా మంలో రేకుల షెడ్డు కూల్చివేసిన ఘటనకు సంబంధించి ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. ఈనెల 22 శనివారం గ్రామానికి చెందిన పీతల గుర్రయ్య రేకుల షెడ్డును గ్రామానికి చెందిన పీతల రాము కూల్చివేసినట్లు ఫిర్యాదు చేయగా..తాము కూల్చివేయలేదని గుర్రయ్యపై రాము ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment