
గిరిశిఖర గ్రామాల్లో నిలిచిన పనులు
సాలూరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాటి ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవతో మంజూరైన రోడ్ల పనులు నిలిచిపోయాయని పాచిపెంట మండలం కేరంగి, మిలియాకంచూరు తదితర పంచాయతీల సర్పంచ్‌లు వాపోయారు. ఈ మేరకు సోమవారం వారు రాజన్నదొరను సాలూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో మీరు మంజూరుచేసిన కొండమోసూరు నుంచి అల్లంపాడు రోడ్డు, కేరంగి రోడ్డు జంక్షన్ నుంచి దొరలుద్దంగి రోడ్డు పనులు నేటికి ప్రారంభం కాలేదన్నారు. అంతేకాకుండా సర్పంచ్‌లైన తమకు తెలియకుండా తమ పంచాయతీల్లో పనులు చేపట్టడానికి కొంతమంది కాంట్రాక్టర్‌లు వస్తున్నారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని వాపోయారు. ఈ మేరకు రాజన్నదొరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ, స్థానిక సర్పంచ్‌లకు తెలియకుండా పనులు చేపట్టరాదని,సర్పంచ్‌ల హక్కులకు భంగం కలిగితే అండగా తాను ఎప్పుడూ ఉంటానని స్పష్టంచేశారు.
మాజీ డిప్యూటీ సీఎం వద్ద వాపోయిన గిరిజన సర్పంచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment