
ఆరోగ్యకరమైన ఆహారం చిరుధాన్యాలతో సాధ్యం
విజయనగరం అర్బన్: ఆరోగ్యరమైన ఆహారంలో భాగంగా చిరుధాన్యాలు కీలకంగా నిలుస్తాయని అందుకే వాటితో తయారైన ఆహారాన్ని సూపర్ ఫుడ్‌గా పిలుస్తారని కేంద్రియ గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీవీకట్టిమణి అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక కేంద్రియ గిరిజన యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంగణంలో ‘మిల్లెట్స్ క్వెస్ట్ 2025: బిల్డింగ్ రెసిలెన్స్, ఫీడింగ్ ది వరల్ట్’ అనే అంశంపై రెండు రోజులపాటు నిర్వహించే సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో వివరించారు. 21వ శతాబ్దంలో మిల్లెట్ల వినియోగం, సంరక్షణ ప్రాముఖ్యత, ఆవశ్యకతను వెలుగులోకి తీసుకురావడం ఈ సెమినార్ ఉద్దేశమని తెలపారు. ఆరోగ్యకరమైన ఆహారం చిరుధాన్యాల ద్వారా అందుతుందని దీనిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. వాటిని పండించే రైతును ప్రోత్సహించినట్లు అవుతుందని పిలుపునిచ్చారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సి.తారాసత్యవతి హాజరవగా రీసోర్స్ పర్సన్లుగా పర్యావరణవేత్త ప్రకృతివనం ప్రసాద్, మధ్యప్రదేశ్‌కు చెందిన మిల్లెట్స్ రాయబారి లహరిబాయి, గిరిజన రైతు పడాల భూదేవి, నారీశక్తి పురస్కార్, ఒడిశాలోని కోరాపుట్ మిల్లెట్ క్వీన్ ఆఫ్ ఇండియా రైమతి ఘియురియా హాజరయ్యారు. అనంతరం ముఖ్యఅతిథులను వీసీ ప్రొఫెసర్ కట్టిమణి ఘనంగా సత్కరించారు. గిరిజన అధ్యయన విభాగాధిపతి డాక్టర్ అనిరుధ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సదస్సులో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, వివిధ విభాగాల డీన్లు ప్రొఫెసర్ శరత్చంద్రబాబు, ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
గిరిజన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్
టీవీ కట్టిమణి
వర్సిటీలో మిల్లెట్ రెసిలెన్స్ సదస్సు ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment