
విధి నిర్వహణలో క్రమశిక్షణ ముఖ్యం
విజయనగరం క్రైమ్: శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్‌శాఖకు అత్యంత ముఖ్యమైనదని అందులోనూ ఆర్మ్‌డ్ రిజర్వ్‌కు కీలకమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం ఏఆర్ సిబ్బంది 14 రోజుల మొబిలైజేషన్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ముందుగా ఏఆర్‌సిబ్బంది పరేడ్‌ను తిలకించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఆర్మ్‌డ్ రిజర్వ్ కీలకమన్నారు. నిరంతరం వెపన్స్‌తోనే సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరి దృష్టి పోలీస్‌శాఖపైనే ఉంటుందని, ప్రజలు అను నిత్యం మన తీరును గమనిస్తూ ఉంటారని, అందుకు పోలీసులు మార్గదర్శకంగా ఉండాలని ఎస్పీ హితవు పలికారు. విధి నిర్వహణలో క్రమ శిక్షణ ఎంతో అవసరమన్నారు. దాన్ని ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల భద్రత, శాంతి భద్రతల విషయంలో ఏఆర్ సిబ్బందే కీలక పాత్ర పోషిస్తున్నారని ఎస్పీ అన్నారు. ఈ పునశ్చరణ తరగతులలో వీఐపీల భద్రత, పైరింగ్, మాబ్ ఆపరేషన్, వ్యక్తిత్వ వికాసం, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, అలాగే అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం, రైట్ గేర్ ఆపరేషన్, యోగా వంటి అంశాల్లో ఏఆర్ సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ముగింపు కార్యక్రమంలో పరేడ్ కమాండర్‌గా ఆర్‌ఎస్సై గోపాలనాయుడు వ్యవహరించగా సిబ్బంది పరేడ్ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీసీ డీఎస్పీ వీరకుమార్, ఆర్‌ఎస్సైలు రమేష్ కుమార్, శ్రీనివాసరావు, ఎస్బీ సీఐలు లీలారావు, చౌదరి, రూరల్ సీఐ లక్ష్మణరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఏఆర్ పునశ్చరణ ముగింపు వేడుకల్లో ఎస్పీ వకుల్ జిందల్
Comments
Please login to add a commentAdd a comment