గురుకులాల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాబోధన
సీతానగరం: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఈ ఏడాది మార్చి నెలలో జరగనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఉమ్మడి జిల్లాలో శతశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కష్టపడి పనిచేస్తున్నారని గురుకులాల కో ఆర్డినేటర్ ఎస్ రూపవతి అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా జోగింపేట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాన్ని సోమవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి మంచిఫలితాలు సాధించాలని కోరారు. జిల్లాలో 2024–25 విద్యాసంవత్సరం పరీక్షలకు టెన్త్‌లో 360 మంది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 287 మంది, రెండవ సంవత్సరం పరీక్షలకు 223 మంది విద్యార్థులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ ఏడాది అన్ని గురు కులాల్లో ప్రణాళికాబద్ధంగా విద్యను భోదిస్తున్నారన్నారు. అనంతరం జోగింపేట పాఠశాలలో వంటశాలను, వంటలను, మైదానాన్ని, తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా కో ఆర్డినేటర్ రూపవతిని ప్రిన్సిపాల్ మధుబాబు, అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జేవీఎస్ మధు, సీనియర్ అధ్యాపకుడు ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ రూపవతి
Comments
Please login to add a commentAdd a comment