
ఆధార్ కేంద్రంలో అక్రమ వసూళ్లు!
రాజాం: రాజాం పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన ఆధార్ సెంటర్‌లో అధిక మొత్తంలో వసూళ్లపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆధార్‌లో సవరణలు, చేర్పులు, మార్పు లు, యాక్టివేషన్, జనరేషన్, కొత్త ఆధార్ కార్డుల మంజూరు తదితర సేవలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.50లు తీసుకోవాల్సిన సేవకు రూ.150 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై ప్రశ్నించిన వారికి సేవలు అందించడంలేదని పలువురు వాపోతున్నారు. ఇదే విషయాన్ని తహసీల్దార్ ఎస్.కె.రాజు వద్ద ప్రస్తావించగా రాజాం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద ఆధార్ కేంద్రాన్ని పరిశీలిస్తామని, అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment