సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డికి అపూర్వ ఆదరణ లభించడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ నాయకుడికి బ్రహ్మరథం పట్టారని వివరించారు. రాాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి తగిన భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గుంటూరు మిర్చి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన ఆయనకు భద్రత కల్పించకుండా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా తమ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment