
భోజనం పరిశీలన
విజయనగరం ఫోర్ట్: ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో రోగులకు అందించే భోజనంలో నాణ్యత, పరిమాణం తగ్గుతుందనే అంశంపై ‘మనసులోనే మధనపడుతూ..!’ అనే శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగులకు అందించిన భోజనాన్ని సంబంధిత ఆస్పత్రి మిత్రలు సోమవారం పరిశీలించారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్లు పరిశీలించారు.
550 క్యూసెక్కుల సాగునీరు సరఫరా
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువల నుంచి 550 క్యూసెక్కుల సాగునీటిని ఆయకట్టుకు సరఫరా చేస్తున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో 10వేల ఎకరాల్లో ఆరుతడి పంటల సాగుకు వీలుగా నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. సాగునీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హుండీల ఆదాయం రూ.2,29,121లు
చీపురుపల్లి: పట్టణంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 2025 జనవరి 3 నుంచి 2025 ఫిబ్రవరి 24 వరకు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకుల రూపంలో రూ.2,29,121ల ఆదాయం వచ్చినట్టు కోటమ్మ అమ్మవారి గ్రూపు దేవాలయాల కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బి.శ్రీనివాస్, కానిస్టేబుల్ ఎం.సరస్వతి పాల్గొన్నారు.
షాపు చిన్నది.. బిల్లు పెద్దది
గరుగుబిల్లి: చిన్న షాపుకు పెద్ద మొత్తంలో బిల్లు రావడంతో వినియోగదారుడు బెంబేలెత్తిపోతున్నాడు. గరుగుబిల్లి మండల కేంద్రంలో మధుసూదనరావు నిర్వహిస్తున్న మెడికల్ షాపుకు జనవరి నెలకు 38 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.16,579లు, ఫిబ్రవరి నెలలోనూ అదే మొత్తంలో యూనిట్ల వినియోగానికి రూ.8,265లు విద్యుత్ బిల్లు వచ్చింది. మండల విద్యుత్‌శాఖాధికారులకు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బిల్లును సరిచేస్తామని చెప్పారని షాపు నిర్వాహకుడు తెలిపారు.
గూడ్స్ రైలులో పొగలు
కొమరాడ: రాయగడ నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న గూడ్స్‌రైలు నుంచి పొగలు వ్యాప్తి చెందాయి. గుమడ రైల్వేస్టేషన్‌కు రాగానే 17 నంబర్ వ్యాగన్ నుంచి పొగలు ఒక్కసారిగా రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలును నిలిపి పార్వతీపురం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళం పొగను అదుపుచేశారు. ప్రమాదమేమీ లేదని, ఘటన కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

భోజనం పరిశీలన

భోజనం పరిశీలన

భోజనం పరిశీలన

భోజనం పరిశీలన

భోజనం పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment