సాంకేతిక సామర్థ్యాల పెంపునకు ‘పాల్ ల్యాబ్’
విజయనగరం అర్బన్: విద్యార్థుల్లో సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించేందుకు పాల్‌ల్యాబ్‌లు దోహదపడతాయని రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు మాధవీలత, ధనలక్ష్మి అన్నారు. జిల్లాకు కొత్తగా పాల్ ల్యాబ్‌లు మంజూరైన పాఠశాల ప్రిన్సిపాల్/ ప్రధానోపాధ్యాయులు, మేథ్స్, లాంగ్వేజ్ సబ్జెక్టు టీచర్లకు కంటోన్మెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. శిక్షణలో నేర్చుకున్న మెలకువలను విద్యార్థులకు బోధించాలన్నారు. డీఈఓ యు.మాణిక్యంనాయుడు మాట్లాడుతూ ప్రయోగశాలల నిర్వహణ, ట్యాబ్‌ల వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా బోధన సాగించాలన్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌ఎస్ ఏపీఓ గోపీచంద్, ఏఎస్‌ఓలు సూర్యారావు, సీహెచ్‌జగన్మోహన్, ఏపీఓ డీఈఓ ఆఫీస్ విశేశ్వరరావు, పార్వ తీపురం మన్యం జిల్లా ఏఎస్‌ఓ వి.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. రీసోర్స్ పర్సన్‌గా కాన్విజేషన్ టీప్ ప్రతినిధులు రూపేష్, రమేష్‌లు వ్యవహరించారు. శిక్షణలో 116 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాష్ట్ర సమగ్ర శిక్ష రాష్ట్ర పరిశీలకులు మాధవీలత, ధనలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment