జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పా
విజయనగరం ఫోర్ట్: పంటల దిగుబడి పెంచడం, నాణ్యమైన పంటల ఉత్పత్తి, ఉత్పాదకత, సేంద్రియ సాగును ప్రోత్సహించడం, మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, రుణసాయం అందించి ప్రోత్సహించడం కోసం జిల్లాలో రెండు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. క్లస్టర్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తన చాంబర్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో చర్చించారు. దత్తిరాజేరులోని పోరలి, సరేవలస, టి.బూర్జవలస, గడసాం గ్రామాలను ఒక క్లస్టర్‌గాను, రామభద్రపురం గ్రామాన్ని ఒక క్లస్టర్‌గా ఎంపిక చేశామన్నారు. దత్తిరాజేరు క్లస్టర్‌లో 283 కుటుంబాలు, రామభద్రపరం క్లస్టర్‌లో 290 కుటుంబాలు ఉన్నాయన్నారు. మూడేళ్లలో రూ.40 లక్షల వ్యయంతో క్లస్టర్ పరిధిలోని రైతు లకు మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, రుణ సహాయాన్ని అందించేందుకు వ్యవసాయ అనుబంధ శాఖల వారీగా సమగ్ర ప్రణాళికను రుపొందించాలన్నారు. సమావేశంలో పశుసంవర్థక శాఖ జేడీ వై.వి.రమణ, ఉద్యానశాఖ డీడీ జమదగ్ని, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment