పంటల బీమాకు సంబంధించి వరిపంటకు ఎకరాకు రూ.42 వేలు బీమా వర్తిస్తుంది. దీనికి రూ.630 రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మినుము పంటకు ఎకరాకు రూ.20 వేలు బీమా వర్తిస్తుంది. దీనికి ఎకరాకు రైతు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. పెసర పంటలకు సంబంధించి ఎకరాకు రూ.20 వేలు వర్తిస్తుంది. దీనికి ప్రీమియం రైతు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. మొక్కజొన్న పంటకు సంబంధించి ఎకరాకి రూ. 540 చెల్లించాలి. దీనికి రూ.36 వేలు బీమా వర్తిస్తుంది. జీడి మామిడికి ఎకరాకు రూ.30 వేలు బీమా వర్తిస్తుంది. దీనికి రైతు ప్రీమియం రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment