విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. అమ్మవారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ .ప్రసాద్ పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment