బస్సు ఢీకొని వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలంలోని బూశాయవలస గ్రామానికి చెందిన వ్యక్తి బస్సు ఢీకొనడంతో గాయపడి బాడంగి సీహెచ్‌సీలో సోమవారం రాత్రి మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మడక కృష్ణ(62)తన ఇంటికి వెళ్లిపోవడానికి సోమవారం సాయంత్రం జాతీయ రహదారి దాటుతుండగా విజయనగరం నుంచి మితిమీరిన వేగంతో వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యుడు మడక శ్రీరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
48 గంటల పాటు మద్యం అమ్మకాలు బంద్
పార్వతీపురంటౌన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మద్యం దుకాణాలు 48 గంటల పాటు మూసివేసినట్లు ఎకై ్సజ్ ఈఎస్ బి.శ్రీనాథుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని మద్యం దుకాణాలకు సీల్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 53 మద్యం దుకాణాలు, 8 బార్లకు సీల్ వేశామన్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ నెల 27 సాయంత్రం నాలుగు గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు రోజు కూడా వాటిని యూసివేయాలని ఆదేశించారు.
మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
నెల్లిమర్ల రూరల్: మండలంలోని సతివాడ గ్రామంలో ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు మాట్లాడుతూ శివరాత్రి జాతర సందర్భంగా నెల్లిమర్ల–బొప్పడాం రహదారిలో పూర్తిస్థాయిలో నిఘా పెట్టామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మద్యం షాపులను మూసివేశామని, బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అక్రమంగా గ్రామాల్లో మద్యం అమ్మకాలు సాగిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దమనసు చాటుకున్న చిన్నారి
మెరకముడిదాం: ఆ బాలుడు వయసులో చిన్నవాడే.. కానీ మనసు పెద్దదని చాటుకున్నాడు. మెరకముడిదాం జెడ్పీ ఉన్నతపాఠశాలలో ఆరురోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ శిక్షణ తరగతులకు హాజరైన భైరిపురం అంగన్‌వాడీ కార్యకర్త సుజాత తన చెవికి ఉన్న బంగారు చెవిదిద్దను పారేసుకున్నారు. అది ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆమె తోటి అంగన్‌వాడీ కర్యకర్తలతో కలిసి పాఠశాల పరిసరాలన్నీ వెతికినీ దొరకలేదు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఎంఈఓలకు, పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులకు అంగన్‌వాడీ కార్యకర్త సుజాత బంగారు చెవి దిద్దు పోగొట్టుకున్న విషయాన్ని తెలియజేసి ఎవరికై నా దొరికితే తీసుకువచ్చి అందజేయాలని చెప్పారు. కొద్దిసేవటి తరువాత పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న ఆరవతరగతి విద్యార్థి గంట్యాడ శ్యామ్‌ప్రసాద్‌కు ఆ చెవిదిద్దు కనిపించింది. దానిని వెంటనే తీసి పాఠశాల ఉపాధ్యాయులకు అందజేసి తన పెద్దమనసును చాటుకున్నాడు. శ్యామ్‌కుమార్ అందజేసిన చెవిదిద్దును ఎంఈఓ చంద్రశేఖర్ పాఠశాల హెచ్‌ఎం ఎల్లంనాయుడు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు శ్రీదేవి, లక్ష్మిల ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్త సుజాతకు అందజేశారు. అలాగే నిజాయితీగా తనకు దొరికిన బంగారు చెవిదిద్దును తిరిగి అందజేసిన శ్యామ్‌కుమార్‌ను ఎంఈఓలు చంద్రశేఖర్ పాఠశాల ఉపాద్యాయులు, ఐసీడీఎస్ సిబ్బంది అభినందించారు.
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment