తల్లికి వందనం అందక.. తల్లికి తోడుగా
● ఆర్థిక ఇబ్బందులతో బడి బయట బాలిక
ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలిక పేరు జ్యోతి. రామభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఈమె పాఠశాలకు వెళ్లకుండా గాజులు, బొట్లు, తిలకం, చిన్నచిన్న క్లిప్‌లు తదితర మహిళలకు సంబంధించిన వస్తువులు గ్రామంలోని వీధుల్లో కేకలు వేస్తూ అమ్ముతూ కనిపించింది. ఏం తల్లి బడికి వెళ్లడం లేదా?చదువుతున్నావా? లేదా? అని సాక్షి ప్రశ్నించగా తాను స్థానిక ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నానని, తన తల్లి రోజూ ఈ వస్తువులు అమ్మేదని, ఆమెకు జ్వరం రావడంతో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా తాను బడికి సెలవు పెట్టి అమ్ముతున్నానని చెప్పింది. వారు స్థానిక బైపాస్ రూట్ సమీపంలో ఉన్న సత్యసాయిబాబా ఆలయం వెనుక గుడారాల్లో నివాసం ఉంటున్నారు. పాఠశాలకు పిల్లలు వస్తున్నారా? లేదా అన్న విషయం ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15వేలు అందజేసేది. అప్పుడు పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లి చదువుకునే వారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే ఇలా పిల్లలు బడికి వెళ్లకుండా చదువుకు దూరమవుతున్నారని ఆ వీధిలోని మహిళలు చర్చించుకోవడం విశేషం.
– రామభద్రపురం
Comments
Please login to add a commentAdd a comment