ఆధార్ కేంద్రం తనిఖీ
రాజాం: పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ ఆధార్ కేంద్రాన్ని ఇన్‌చార్జి ఆర్‌ఐ అబ్బాసుతో పాటు వీఆర్వో శ్రీనివాసరావు మంగళవారం తనిఖీచేశారు. ఇక్కడ అనధికార వసూళ్లపై ‘ఆధార్ కేంద్రంలో అక్రమ వసూళ్లు’ అనే శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన వార్తకు తహసీల్దార్ ఎస్.కె.రాజు స్పందించారు. కేంద్రం పనితీరు, సేవల వివరాలు, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. రూ.100లు కంటే అధికంగా నగదు వసూళ్లపై నిర్వాహకులతో మాట్లాడి హెచ్చరికలు జారీచేశారు. పలువురు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆధార్ కేంద్రాన్ని సక్రమంగా నడపాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు.
27, 28 తేదీల్లో జీఎంఆర్ ఐటీలో స్టెప్‌కాన్ సదస్సు
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీలో ఈ నెల 27, 28 తేదీల్లో స్టెప్‌కాన్ 17వ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్‌వీఆర్‌ఎస్‌వీ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరుకానున్న సుమారు 4వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య వినూత్న ఆలోచనలు, చురుకైన సృజనాత్మక చర్చలు, సమకాలీన ఆలోచనలకు సదస్సు వేదిక కానుందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ (రిలైజ్, రిఫైన్, రీడిఫైన్) అనే నినాదంతో 17వ సారి నిర్వహిస్తున్నామని తెలిపారు. సదస్సును ఆంధ్రప్రదేశ్ మాజీ ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి ప్రారంభిస్తారన్నారు. ప్రాజెక్టు ఎక్స్‌పో, స్టార్టప్ ఇండియా కాంటెస్ట్‌తోపాటు పేపర్ ప్రజెంటేషన్, జీఎంఆర్ ప్రీమియర్ లీగ్ వంటివి ప్రధాన ఈవెంట్లు కానున్నాయని తెలిపారు. ప్రతి ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్లాగ్ షిప్ ఈవెంట్లుగా హ్యాక్‌హబ్, వెబ్ అస్త్ర, నావిగేషన్ చాలెంజ్, క్యాడ్‌మానియా, హైడ్రోహైక్ 2.0, రోబోరష్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమానికి కన్వీనర్‌గా డాక్టర్ జె.శ్రీధర్, కో కన్వీనర్‌గా డాక్టర్ ఎం.సతీష్ వ్యవహరిస్తారని తెలిపారు.
ఆధార్ కేంద్రం తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment