బీమా డ్రామా..!
కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు మంగళం పాడేసింది. బీమా ప్రీమియం చెల్లించిన రైతులకూ పలు కొర్రీలతో
ధీమా లేకుండా చేస్తోంది.
● విశిష్టతల సమాహారం
రామతీర్థ క్షేత్రానికి ఉత్తర దిక్కున నీలాచలం పేరుతో రెండు కిలోమీటర్ల పొడవు గల ఏకశిలా పర్వతం బోడికొండగా వ్యవహారంలో ఉంది. ఈ పర్వతంపై సీతారాములు, పాండవులు సంచరించినట్లుగా చిహ్నాలున్నాయి. పర్వత శిఖరాన కోదండరాముని ఆలయం, దాని పక్కనే ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ పేరుతో నీటికొలను ఉంది. ఈ నీటి మడుగు నుంచి పడమర దిశగా ఇరుకురాయి, దాని మధ్య నుంచి వెళితే భీముని బొర్ర చిహ్నం ఉంటుంది. అక్కడే భీముడు వంట చేయడానికి ఉపయోగించిన గాడి పొయ్యి కూడా ఉంది. దీనికి సమీపంలో ఉన్న గుహలో బుద్ధ విగ్రహం, పలుకురాయి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకసారి పిలిస్తే ఆ పిలుపు మూడుసార్లు ప్రతిధ్వనిస్తుంది. పాండవుల ఐదు పంచలు, సీతమ్మవారి పురిటి మంచం తదితర చిహ్నాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కొండ పక్కనే దుర్గాభైరవ కొండ, బౌద్ధుల నివాస గుహలు ఉన్నాయి. చారిత్రక గుర్తులను చూసేందుకు భక్తులు, సందర్శకులు అధిక సంఖ్యలో పర్వతంపైకి వెళుతుంటారు. రామతీర్థం రామాలయంలో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్ష్మిదేవి, మాధ వస్వామి, భూభుజంగ వరహాలక్ష్మి స్వామి, ఆ ళ్వారుల సన్నిధి, శ్రీరామక్రతువు స్తంభం, సదాశివస్వామివార్ల ఉపాలయాలున్నాయి. నిర్విరామంగా ప్రతినిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment