గిరిశిఖర గ్రామాల్లో జ్వరాల పంజా
శృంగవరపుకోట మండలం ధారపర్తి పంచాయతీ పరిధిలోని కురిడి, రాయిపాలెం గ్రామాలు విషజ్వరాలతో మంచంపట్టాయి. కురిడిలో 11 మంది పిల్లలు జ్వరాల బారిన పడడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాయిపాలెంలోనూ ఇదే పరిస్థితి. వాహనాలు వెళ్లే దారిలేకపోవడంతో పిల్లలను భుజాలపై మోసుకుంటూ కొండలుదిగి ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వైద్యులు తక్షణమే స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి సేవలందించాలని ఏపీ గిరిజన సంఘ నాయకుడు జరతా గౌరీష్, గ్రామస్తులు కోరారు.
– ఎస్.కోట
గిరిశిఖర గ్రామాల్లో జ్వరాల పంజా
గిరిశిఖర గ్రామాల్లో జ్వరాల పంజా
Comments
Please login to add a commentAdd a comment