సంతకవిటి: మండలంలోని మండాకురిటి గ్రామానికి చెందిన కొప్పుశెట్టి కోటేశ్వరరావు, పలిశెట్టి శీతయ్యలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేయడంతో 5గురు వ్యక్తులపై రెండు కేసులు నమోదు చేశామని హెచ్‌సీ వంజరాపు జనార్దనరావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..కొప్పుశెట్టి కోటేశ్వరరావు పొలంలో సర్వే మొక్కలను పలిశెట్టి శీతయ్యకు చెందిన నాటు బండ్లు కుమ్మేయడంతో గొడవ జరిగింది. పలిశెట్టి శీతయ్య, లక్ష్మణరావు, గోవిందలు తనపై దాడి చేశారని కొప్పుశెట్టి కోటేశ్వరరావు.. కొప్పుశెట్టి కోటేశ్వరరా వు, శ్రీనులు తమపై దాడి చేశారని పలిశెట్టి శీతయ్య ఫిర్యాదు చేయడంతో పరస్పర ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment