
పోలీసుల అదుపులో చీటీల మోసగాళ్లు
భోగాపురం: మండల కేంద్రం భోగాపురంలో కొన్ని సంవత్సరాలుగా చీటీలు, చిన్నచిన్న ల్యాండ్ వ్యాపారాలు చేసుకుంటూ భార్యాభర్తలు తిరుమరెడ్డి మురళి, తులసి కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఇలా జీవనం సాఫీగా సాగిపోతున్న సమయంలో గడిచిన రెండు నెలలుగా చీటీదారులకు, అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పకుండా ఊరిలోనూ కనిపించకుండా బయట తిరుగుతున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దాదాపు రూ.30కోట్లు నష్టపోయామని బాధితులు పోలీసులు ముందు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు తిరుమరెడ్డి మురళి, తులసిలను రాజమహేంద్రవరంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి తగరపువలస ఉన్న ఇంటితో పాటు, భోగాపురంలో ఉన్న రెండు ఇళ్లు,, కొన్ని రకాల ల్యాండ్‌కు సంబధించిన రికార్డులను స్వాధీనం చేకుసుకున్నారు. అనంతరం విజయనగరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సీఐ ఎన్‌వీ ప్రభాకర్ బుధవారం తెలిపారు.
వంగరలో అగ్నిప్రమాదం
వంగర: మండల కేంద్రం వంగరలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కర్రి రాములు గడ్డివాము దగ్ధం కాగా దేవకివాడ రామినాయుడు, రౌతు అసిరినాయుడులకు చెందిన జీడి, మామిడి చెట్లు ఆహుతయ్యాయి. సమాచారం మేరకు రాజాం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో కాలిన ఇల్లు
వంగర: మండల పరిధి కింజంగి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక పెంకుటిల్లు కాలిపోయింది. బుధవారం గ్రామానికి చెందిన గంట లక్ష్మి ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు రాజాం ఫైర్ ఆఫీసర్ టి.మోహనరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక శకటంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో నగదు కొంత కాలిపోయిందని బాధితురాలు గంట లక్ష్మి అధికారులకు తెలిపింది. ఈ ఘటనలో రూ.2లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని వీఆర్‌వో గెడ్డాపు శ్రీనివాసరావు వెల్లడించారు.
మద్యం సీసాలతో వ్యక్తి అరెస్టు
బొబ్బిలి: తెర్లాం మండలం కుసుమూరులో 14 మద్యం సీసాలతో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ పి.చిన్నంనాయుడు విలేకరులకు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 48 గంటల పాటు మద్యం విక్రయాలు నిషేధించామని, అయినా ఇతర ప్రాంతాల్లో మద్యం విక్రయాలను చేపడుతున్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా మద్యం సీసాలతో దొరికితే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పోలీసుల అదుపులో చీటీల మోసగాళ్లు

పోలీసుల అదుపులో చీటీల మోసగాళ్లు
Comments
Please login to add a commentAdd a comment