
బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో.. మహాశివరాత్రి వేడుకలు
విజయనగరం టౌన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్దానిక కంటోన్మెంట్‌లో ఉన్న బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. అద్దాలతో అలంకరణ చేసిన శివలింగాల ప్రదర్శన భక్తిభావాన్ని పెంపొందించింది. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాలను ఆయా స్ధానాల్లో ఏర్పాటుచేసి, వాటి విశిష్టతను బ్రహ్మకుమారీలు వివరించారు. బ్రహ్మకుమారీస్ ఇన్‌చార్జ్ బీకే. అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో బ్రహ్మకుమారీలు, భక్తులు పాల్గొన్నారు.

బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో.. మహాశివరాత్రి వేడుకలు

బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో.. మహాశివరాత్రి వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment