
పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించిన జేసీ
చీపురుపల్లి: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ బుధవారం పరిశీలించారు. ఈ మేరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎనిమిది మండలాలకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదం, గుర్ల, రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాల్లో ఎన్నికల నిర్వహణకు నియమించిన పోలింగ్ సిబ్బందికి కిట్లను ఆర్డీఓ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. సజావుగా పోలింగ్ నిర్వహణ జరగాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment