
అవయవదానానికి అంగీకారం
చీపురుపల్లి రూరల్ (గరివిడి): వారంతా చదువుకున్న యువత. ఉన్నతంగా ఆలోచించారు. అవయవదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మరణాంతరం తమ శరీర అవయవాలు బూడిదలో కలిసిపోకూడదని, ఈ సమాజంలో అవయవాల లోపంతో జీవిస్తున్న మరెంతోమందికి తమ మరణాంతరం తమ అవయవాలతో మంచి జరగాలనే సంకల్పంతో అవయవదానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు చీపురుపల్లి పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బీవీ.గోవిందరాజులు గ్రామానికి వెళ్లి అవయవదాన ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ మేరకు గ్రామానికి చెందిన 120 మంది యువత, గ్రామస్తులు అవయవదానానికి అంగీకారం తెలుపుతూ అంగీకార పత్రాలపై సంతకాలు చేసి మానవీయత సంస్థ వ్యవస్థాపకుడు బీవీ.గోవిందరాజలుకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామయువత, పెద్దలు తలాడ సుబ్బలక్ష్మి, పెనుమత్స సాంబమూర్తిరాజు,గుడివాడ నారాయణరావు, పిల్ల నారాయణరావు, కోన పైడినాయుడు, బార్నాల సూరప్పలనాయుడు, శనపతి అప్పలనాయుడు, గుడివాడ శ్రీరాంనాయుడు, జమ్మాన తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ముందడుగు వేసిన వెదుళ్లవలస యువత
Comments
Please login to add a commentAdd a comment