
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
బొబ్బిలి: పట్టణంలోని కొత్త ఎరుకల వీధికి చెందిన గేదెల సోములు(29) మనస్తాపంతో తాను నివసిస్తున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్ రమేష్ విలేకరులకు తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం తరచూ తనను ఎవరూ ఖాతరు చేయడం లేదని సోములు విసుక్కుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ తిట్టుకుండే వాడు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి శంబర పండగకు వవెళ్లారు. అక్కడ దర్శనం సమయంలో కాస్తా ఆలస్యమైంది. ఆ సమయంలో ఎవరో త్వరగా వెళ్లమని ముందకు తోయడంతో భార్యపై చిరాకుపడ్డాడు. సోములు కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి వచ్చేసినా అదే ఆలోచనతో బాధపడ్డాడు. రాత్రి సమయంలో ఇంట్లోని మొదటి గదిలో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన భార్య ఇరుగుపొరుగు సాయంతో వచ్చి కిందికి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రమేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment