
భక్తజన తీర్థం
నెల్లిమర్ల రూరల్: శివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం బుధవారం భక్తజన తీర్థంగా మారింది. సాక్షాత్తు శ్రీరాముడు ఇక్కడ శివుని మంత్రం జపించారని విశ్వసించిన భక్తులు.. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి రాముడి సన్నిధిలో శివరాత్రి జాగరణ చేశారు. శివకేశవులకు భేదంలేదని చాటారు. రామస్వామివారి ఆలయం, ఆలయ క్షేత్ర పాలకుడైన ఉమాసదాశివ ఆలయం, రామకోనేరు, బోడికొండ, గురుభక్తుల కొండ, దుర్గాభైరవ కొండ ప్రాంతాలన్నీ భక్తజనంతో కిక్కిరిసాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో కాగడాలు వెలిగించి రాత్రంతా శివజాగరణ చేశారు.
ప్రత్యేక అభిషేకాలు
రామాలయ క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న ఉమాసదాశివ ఆలయంలో అర్చకుడు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో బుధవారం వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించారు. 11 రకాల ఫలరసాలు, భస్మ, చందన, హరిద్రా కుంకుమ, సుగంధ ద్రవ్య, నారికేళ జలాలతో శివుడికి మహాభిషేకం చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు మహాలింగోద్భవ సమయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భస్మపూజ, అష్టమూర్తి హారతి, త్రయంబిక మంత్రజపం జరిపారు.
వెలుగులు పంచిన శిఖర జ్యోతి
రామతీర్థం బోడికొండ పర్వతంపై శిఖరదీపాన్ని సాయంత్రం 6 గంటలకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెలిగించారు. దీనికి కావాల్సిన సామగ్రిని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సమకూర్చారు. రెండు రోజుల పాటు శిఖర దీపం కొండపై వెలగనుంది. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు పర్వతంపైకి చేరుకొని శిఖరదీపాన్ని దర్శించుకున్నారు. ఈఓ వై.శ్రీనివాసరావు, సీఐ రామకృష్ణ, ఎస్సై గణేష్, పోలీస్ సిబ్బంది ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సేవలందించారు. సతివాడ, కొండవెలగాడ వైద్య సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మిమ్స్ వైద్య కళాశాల ఆధ్వర్యంలో వైద్య సేవలు కొనసాగాయి.
శివరాత్రికి తరలివచ్చిన ఆశేష భక్తజనం
ఆలయ ప్రాంగణంలో జాగరణ
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శిఖర జ్యోతి

భక్తజన తీర్థం

భక్తజన తీర్థం

భక్తజన తీర్థం

భక్తజన తీర్థం

భక్తజన తీర్థం
Comments
Please login to add a commentAdd a comment