
పకడ్బందీగా చదువుప్రణాళిక
వంగర: జిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో ఈ ఏడాది పదోతరగతి, ఇంట ర్మీడియట్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉమ్మడి విజయనగరం గురుకులాల సమన్వయకర్త శంబాన రూపవతి అన్నారు. 100 రోజుల చదువు ప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నట్టు తెలిపారు. వంగర మండలం మడ్డువలసలోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ గురుకులాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. తొలుత వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యత తనిఖీ చేశారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. అనంతరం డార్మిటరీ, తర గతి గదులు, క్రీడామైదానం పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై బోధన ప్రణా ళిక అమలుతీరుపై ఆరా తీశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రానున్న విద్యాసంవత్సరంలో నీట్, ఐఐటీ, ఎంసెట్ వంటి పోటీపరీక్షలకు ప్రత్యేక తర్ఫీదునిస్తామని తెలిపారు. కేఎల్‌వైఈఎస్ విధానంలో గురుకుల విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వంగర, ఉంగరాడమెట్ట గురుకులాల ప్రిన్సిపాల్స్ సాన పద్మజ, పేడాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆ ప్యాచ్‌వర్కుల ఖర్చు రూ.50లక్షలు!
కింది చిత్రం చూశారా... అది గజపతినగరం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి నుంచి మెంటాడ వెళ్లే రోడ్డు. ఈ రోడ్డులో పురిటిపెంట వరకు 1.4 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతులకు కూటమి ప్రభుత్వం రూ.50లక్షలు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ (కూటమి నాయకుడు) అధికార బలంతో అక్కడక్కడ ప్యాచ్‌వర్క్‌లు చేసి నిధులు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్యాచ్ వర్క్‌లను తూతూ మంత్రంగా చేసేశారు. ఈ రోడ్డును చూసిన వారు ఇంత చిన్నపనికి రూ.50 లక్షల ప్రజాధనాన్ని ఎలా కేటాయిస్తారంటూ ప్రశ్నిస్తుండడం
తో బిల్లులు మంజూరు చేసేందుకు అధి
కారులు వెనుకంజవేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఆర్‌అండ్‌బీ జేఈ అజయ్‌వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా 1.4 కిలోమీటర్ల రెగ్యులర్ రోడ్డుకు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసిందన్నారు. అయితే పూర్తిస్థాయిలో 1.4 కిలోమీటరు వరకూ రోడ్డు వేయలేదని, మధ్యమధ్యలో రోడ్డు పాడైనచోట మాత్రమే రోడ్డు వేసినట్టు తెలిపారు. ఇది ప్యాచ్‌వర్కు కాదని, రెగ్యులర్ రోడ్డేనని చెప్పుకొచ్చారు. కేవలం రూ.39 లక్షలు మాత్రమే కాంట్రాక్టర్‌కు వెళ్తుందని, మిగిలిన రూ.11లక్షలు జీఎస్టీ, నాక్, సీనరీకి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఏదేమైనా నిధులు ఎక్కువ, పని తక్కువ అని స్థానికులు పెదవి విరుస్తున్నారు. పనుల పేరుతో కూటమి ప్రభుత్వం పార్టీ నాయకుల జేబులు నింపేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని విమర్శిస్తున్నారు.
– గజపతినగరం రూరల్

పకడ్బందీగా చదువుప్రణాళిక
Comments
Please login to add a commentAdd a comment