
ఆ పాదముద్రలు పులి పిల్లలవి కాదు
చీపురుపల్లి రూరల్ (గరివిడి):
అవి పులి పిల్లల పాదముద్రలు కాదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుబ్బారావు స్పష్టంచేశారు. గరివిడి మండలం శివరాం గ్రామంలోని ఓ రైతు పొలంలో పులి పిల్లల పాదముద్రలు కనిపించాయన్న వార్తతో గ్రామస్తులు భయాందోళన చెందారు. తహసీల్దార్ సీహెచ్ బంగార్రాజుతో పాటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో తహసీల్దార్, ఆర్‌ఐ అచ్యుతరావు, ఫారెస్టు రేంజ్ అధికారి కలిసి పాదముద్రలను పరిశీలించారు. అవి పులి పిల్లలవి కాదని, వేరే జాతి జంతువుల పిల్లల అడుగులుగా నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment