యువత అన్నిరంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

యువత అన్నిరంగాల్లో రాణించాలి

Published Fri, Sep 27 2024 12:40 AM | Last Updated on Fri, Sep 27 2024 12:40 AM

యువత

వనపర్తి/వనపర్తిటౌన్‌ : యువత అన్నిరంగాల్లో రాణించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి కోరారు. గురువారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో డీవైఎస్‌ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజనోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న యువతకు సాంస్కృతిక, జానపద, గీతాపాలన, వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, కవిత్వం తదితర పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన కళాకారులకు బహుమతులు అందజేయడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు సిఫారస్‌ చేసేందుకు యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఇప్పుడున్న ఇండోర్‌ స్టేడియాన్ని ఆధునికీకరించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రస్తుత కాలంలో పోటీని తట్టుకొని విజయాన్ని అందుకునేలా నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ మాట్లాడుతూ.. చదువుతో పాటు అన్నిరంగాల్లో నైపుణాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, డీపీఆర్వో సీతారాం, డీఐఈఓ అంజయ్య, పీఈటీ సురేంధర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌, కళాకారుడు డప్పు స్వామి, విద్యార్థులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

జానపదం గ్రూప్‌ డ్యాన్స్‌లో లహరి గ్రూప్‌ (ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల, వనపర్తి) మొదటి, బంజార నృత్యం (ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, వనపర్తి) విద్యార్థినులు రెండో బహుమతి, తెలంగాణ జానపద నృత్యం (ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, వనపర్తి) మూడో బహుమతి సాధించారు. అలాగే జానపదం సోలో డాన్స్‌లో సౌమ్య మొదటి, జ్ఞానేశ్వరి ద్వితీయ, తులసి తృతీయ బహుమతి దక్కించుకుంది. జానపద గీతాలు (గ్రూప్‌)లో మునీశ్వరి అండ్‌ గ్రూప్‌ (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వనపర్తి) మొదటి, లాస్య గ్రూప్‌ (టీఎస్‌డౠ్ల్యఆర్‌ఎస్‌జేసీ బాలికలు, కొత్తకోట) రెండు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు మూడో బహుమతి, జానపద గీతాలు సోలోలో లాస్య మొదటి, వైష్ణవి రెండు, మునీశ్వరి మూడో బహుమతి కై వసం చేసుకున్నారు. ఇంగ్లీష్‌ వ్యాసరచన పోటీలో ఎం.మమత మొదటి, ఎస్‌.మణికుమారి రెండు, ముస్కాన్‌ మూడో బహుమతి, పోస్టర్‌ మేకింగ్‌లో శ్వేత మొదటి, ఎన్‌.శారద రెండు, కె.భవాని మూడో బహుమతి, హిందీ, ఇంగ్లీష్‌ ఉపన్యాస పోటీలో ముస్కాన్‌ మొదటి, ఎస్‌.మణికుమారి రెండు, ఎం.మేఘన మూడో బహుమతి దక్కించుకున్నారు. యువక్రీతి పోటీలో బి.నాగేశ్వరి మొదటి, ఆర్‌.భారతి రెండు, ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నో (టెక్నికల్‌ వింగ్స్‌)లో ఆయేషా మొదటి, కె.శైలజ రెండు, ముఫాసిర ఫాతిమా మూడో బహుమతి, బయోలాజికల్‌ వింగ్స్‌లో టీఏ గౌతమి మొదటి, పి.శ్రీవైష్ణవి రెండు, కె.ప్రణీత మూడు, హెచ్‌.సృజన నాలుగో బహుమతి పొందారు.

విజేతలు వీరే..

No comments yet. Be the first to comment!
Add a comment
యువత అన్నిరంగాల్లో రాణించాలి 1
1/1

యువత అన్నిరంగాల్లో రాణించాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement