వరంగల్ అర్బన్: నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులను మూడు నెలల్లో ప్రారంభమయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. శుక్రవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో ఆయన ఇంజనీర్లతో సమావేశమయ్యారు. పట్టణ ప్రగతి, సీఎంఏ, జీఓ 65, జనరల్ ఫండ్ తదితర అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన నేపథ్యంలో.. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులపై సీరియస్‌గా దృష్టి సారించాలన్నారు. ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, పనుల్లో వేగం పెంచాలన్నారు. బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్లలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, ఆపనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, సంతోష్‌బాబు, డీఈ శ్యాంమోహన్, ఏఈ సౌజన్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment