26న ‘ఇందిరా మహిళాశక్తి–ఉపాధి భరోసా’
వరంగల్: ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఈనెల 26న ఇందిరా మహిళాశక్తి–ఉపాధి భరోసా కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో డీఆర్‌డీఓ కౌసల్యాదేవి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇందిరా మహిళాశక్తి, ఉపాధి భరోసాలో భాగంగా 2025 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల క్యాలెండర్‌ను రూపొందించాలన్నారు. పంచాయతీరాజ్ నిధుల నుంచి, జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని చెప్పారు. నిధులు దుర్వినియోగం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మండలాలు, గ్రామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఏ గ్రామానికి ఏమి అవసరమో గుర్తించి ప్రభుత్వ నిబంధనల మేరకు పనులు చేపట్టాలని ఎంపీడీఓలు, ఏపీఓలకు సూచించారు. ప్రతి గ్రామం గంగదేవిపల్లిలా రూపుదిద్దుకునేలా ఉపాధి హామీ పనులు చేస్తే హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందిన జిల్లాగా వరంగల్ గుర్తింపు పొందుతుందని కలెక్టర్ అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, జిల్లా ప్రణాళిక అధికారి గోవిందరాజన్, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు
కార్యాచరణ రూపొందించాలి
మామునూరు ఎయిర్‌పోర్ట్, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు, గ్రీన్‌ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టేందుకు తగిన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్‌న్స్ హాలులో మామునూరు ఎయిర్‌పోర్టు, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, గ్రీన్ ఫీల్డ్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై శుక్రవారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి జిల్లాను సందర్శించిన అనంతరం వెలువడిన జీఓ లకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమీక్షలో ఇన్‌చార్జ్ డీఆర్వో, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్లు నాగేశ్వర్‌రావు, ఇక్బాల్, రాజ్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ జితేందర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ రామకృష్ణ, నేషనల్ హైవే అధికారి సల్మాన్‌రాజ్, జోనల్ మేనేజర్ రాములునాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
2025 ఉపాధి హామీ క్యాలెండర్
రూపొందించాలి
గ్రామాల్లో అవసరమైన పనులు
గుర్తించాలి
అధికారుల సమీక్షలో
కలెక్టర్ డాక్టర్ సత్య శారద
Comments
Please login to add a commentAdd a comment