అందని వేతనాలు
నల్లబెల్లి: పాఠశాల పరిసరాలు, టాయిలెట్స్ శుభ్రం చేస్తూ.. చెట్లకు నీళ్లు పడుతూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్న స్కావెంజర్లు వేతనాలు అందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కూలీ పనులకు వెళ్లినా పూట గడవడం ఇబ్బందిగానే ఉండడంతో పలుచోట్ల ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఆర్థికసాయం చేస్తుండగా.. ఇప్పటికై నా వేతనాలు విడుదల చేయాలని స్కావెంజర్లు కోరుతున్నారు.
జిల్లాలో 637మంది స్కావెంజర్లు
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాత్కలికంగా జిల్లాలో 13 మండలాల్లో 637 మంది స్కావెంజర్లను జూలై 2024లో నియమించింది. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వీరికి వేతనాలు అందించాలని నిర్ణయించింది. అయితే ఎంపికైన నాటి పాఠశాల పరిసరాలు శుభ్రం చేయ డం, టాయిలెట్స్ క్లీన్ చేయడం, చెట్లకు నీరు పట్టడం తదితర పనులు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వేతనం చెల్లిస్తామంటే ఆశతో పనులు చేస్తున్న స్కావెంజర్లకు వేతనాలు సక్రమంగా రాకపోవడంతో నిరాశే మిగిలింది. ఏడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో నిరుత్సాహాని కి గురవుతున్నారు. వేతనాలు సక్రమంగా చెల్లించకపోడంతో ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నామని సంబందిత అధికారులను వేడుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వేతనాలు అందించేలా కృషి చేయాలని కోరుతున్నారు.
ప్రతి నెల వేతనాలు ఇవ్వాలి
విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పిస్తున్న మాకు ఏడు నెలలుగా వేతనాలు అందడంలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వేతనం అందిస్తామని అమ్మ ఆదర్శ కమిటీ వారు చెప్పి పనిలో పెట్టుకున్నారు. వారు చెప్పిన పనులన్నీ చేస్తున్నాం. వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నాం. అధికారులు స్పందించి వేతనాలు ఇచ్చేలా చూడాలి. – కనకం శిరీష, స్కావెంజర్, పీఎస్ నల్లబెల్లి
పెండింగ్ వాస్తవమే..
పాఠశాలల్లో స్కావెంజర్లను ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా నియమించింది. స్కావెంజర్ల గౌరవ వేతనం చెల్లింపులు పెండింగ్ వాస్తవమే.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా త్వరలోనే గౌరవ వేతనాలు చెల్లిస్తాం. – జ్ఞానేశ్వర్, డీఈఓ
●
కూలికెళ్లినా.. పూటగడవడంలేదంటున్న స్కావెంజర్లు
జీతాలు రాక ఏడు నెలలు..
కుటుంబ పోషణ కష్టంగా
ఉందని ఆవేదన
జిల్లాలో స్కావెంజర్ల వివరాలు..
మండలం స్కావెంజర్ల
సంఖ్య
చెన్నారావుపేట 37
దుగ్గొండి 36
గీసుగొండ 42
ఖానాపుర్ 28
ఖిలా వరంగల్ 78
నల్లబెల్లి 36
నర్సంపేట 59
నెక్కొండ 49
పర్వతగిరి 39
రాయపర్తి 54
సంగెం 36
వరంగల్ 91
వర్ధన్నపేట 52
మొత్తం 637
వేతనాలు ఇలా..
విద్యార్థుల సంఖ్య చెల్లించాల్సిన
వేతనం
1 నుంచి 30 వరకు రూ.3 వేలు
31 నుంచి 100 వరకు రూ.6 వేలు
101 నుంచి 250 వరకు రూ.8 వేలు
251 నుంచి 500 వరకు రూ.12 వేలు
అందని వేతనాలు
అందని వేతనాలు
అందని వేతనాలు
Comments
Please login to add a commentAdd a comment