‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో ముందంజ
వరంగల్ అర్బన్: స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25 సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో వరంగల్ నగరం ముందంజలో దుసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా వంద నగరాల్లో వరంగల్ నాలుగో స్థానంలో నిలిచినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. మార్చి 5 వరకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్, డాక్యుమెంటేషన్, ఓడీఎఫ్, క్షేత్రస్థాయిలో పరిశీలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకు ఫలితాలను కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అధికారికంగా పూర్తిస్థాయిలో వెల్ల డిస్తుంది. దేశవ్యాప్తంగా 10 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇప్పటి వరకు సిటిజన్ ఫీడ్‌బ్యాక్ వివరాలు తెలిపారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో 8,02,969 మంది ఉండగా 54,325 మంది నగర పరిశుభ్రతపై ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. రెండోస్థానంలో గ్రేటర్ విశాఖలో 8,02,947 మందికి 49,412 మంది, మూడోస్థానంలో మహారాష్ట్రలోని పింపిరి చించివాడ్‌లో 8,02,811 మందికి 47,790 మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు. నాలుగో స్థానంలో గ్రేటర్ వరంగల్‌లో 8,09,930 మందికి 33,833 మంది వివరాలు తెలిపారు.
మెరుగైన ర్యాంకు సాధిస్తాం :
గుండు సుధారాణి, నగర మేయర్
స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25 సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విభాగం (పౌరుల అభిప్రాయం) జాతీయస్థాయిలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నాలుగో స్థానం దక్కినందుకు మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా టాప్–100 యూఎల్‌బీలు సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సాధించిన స్కోరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ర్యాంకుల్లో గ్రేటర్ వరంగల్ ఉత్తమ ఫలితా లు సాధించిందని ఆమె పేర్కొన్నారు. మార్చి 5 వరకు ప్రజలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం ప్రజారోగ్య సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి నగరవాసులను ఇందులో భాగస్వామ్యం చేసి మొదటిస్థానం దక్కేలా ప్రణాళికాబద్ధంగా కృషిచేయాలని సూచించారు.
సిటిజన్ ఫీడ్‌బ్యాక్ టాప్–100లో
వరంగల్‌కు నాలుగో స్థానం
మార్చి 5 వరకు ప్రజలు అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం
ఇదే స్ఫూర్తి కొనసాగించాలి: అశ్విని తానాజీ వాకడే, గ్రేటర్ వరంగల్ కమిషనర్
నగర ప్రజలు ఇదే స్ఫూర్తి కొనసాగించాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే కోరారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో నగరానికి నాలుగో స్థానం దక్కడంతో కమిషనర్ హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. ఈ విభాగంలో మొదటి స్థానం వచ్చేందుకు అభిప్రాయాలు తెలియజేయాలని సూచించారు. తద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25లో ఉత్తమ ర్యాంకు సాధనకు ఫీడ్‌బ్యాక్ దోహదం చేసే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment