జిల్లాలో వైభవంగా
మహాశివరాత్రి వేడుకలు
● శైవక్షేత్రాల్లో మార్మోగిన శివనామస్మరణ
● అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు
● లింగోద్భవ కాలంలో నేత్రపర్వంగా
శివపార్వతుల కల్యాణం
జిల్లాలో మహాశివరాత్రి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లోని శైవక్షేత్రాలు తెల్లవారుజాము నుంచే కిటకిటలాడాయి. భక్తులు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, పూజలు చేశారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. జిల్లా కేంద్రంలోని కాశిబుగ్గ కాశీవిశ్వేశ్వరాలయం, స్వయంభూ శంభులింగేశ్వరాలయం క్యూలో రద్దీ భారీగా పెరిగింది. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో అర్చకులు నేత్రపర్వంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. జాగరణ చేసిన భక్తుల కోసం ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. – సాక్షి నెట్‌వర్క్
Comments
Please login to add a commentAdd a comment