పోలింగ్ ప్రశాంతం
సాక్షి, వరంగల్: వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హ క్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95 శాతం పోలింగ్ నమోదైంది. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 2,352 మంది ఓటర్లకు గానూ 2,214 మంది (94.13 శాతం) తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి పరిశీలించింది. ఈ ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, సంగంరెడ్డి సుందర్ రాజుయాదవ్, పులి సరోత్తం రెడ్డి, పింగిలి శ్రీపాల్ రెడ్డి, వెంకటస్వామి తదితరులు మొ త్తం 19 మంది బరిలో ఉన్న విషయం తెలిసిందే.
నల్లగొండకు బ్యాలెట్ బాక్స్‌లు...
గురువారం ఎన్నికలను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం బుధవారం మధ్యాహ్నం వరకే పో లింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పత్రాలతో పాటు ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందిని ప్రత్యేక బస్సుల ద్వారా జిల్లాలోని 13 మండలా ల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జ ర్వర్, సెక్టోరియల్ అధికారులు పనిచేశా రు. అలాగే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఏ ర్పాటు చేసిన లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని వీక్షించారు. సెంట్రల్ డీసీపీ షేక్ సలీమాతో కలిసి వరంగల్ ప ట్టణంలోని ఇస్లామియా కళాశాలలో ఏ ర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఓటర్లకు కల్పించిన మౌలిక వసతుల గురించి వాకబు చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు జిల్లాలోని 13 మండలాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా బ్యాలెట్ పత్రాలను బందోబస్తు మధ్య నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించారు. జిల్లాలో పోలింగ్ ప్ర శాంతంగా ముగిసిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని 13 మండలాల్లో 94.13 శాతం నమోదు
మొత్తం 2,352 ఓటర్లకుగాను
2,214 మంది ఓటింగ్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ తీరును పరిశీలించిన కలెక్టర్ సత్యశారద
నల్లగొండకు తరలిన బ్యాలెట్ బాక్సులు
ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు..
జిల్లా ఓటర్లు పోలైనఓట్లు శాతం
జనగామ 1,002 945 94.31
హనుమకొండ 5,215 4,780 91.66
వరంగల్ 2,352 2,214 94.13
మహబూబాబాద్ 1,663 1,571 94.47
జేఎస్ భూపాలపల్లి 329 308 93.62
ములుగు 628 583 92.83
– మరిన్ని ఫొటోలు 9లోu
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment