ముగిసిన ఉభయ రాష్ట్రాల నాటక పోటీలు
వర్ధన్నపేట: భారతీయ నాటక కళాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై బహుమతులు అందజేశారు. ఇందులో ప్రథమ బహుమతి శ్రీసాయి ఆర్ట్స్ కలకులూరు వారి ‘జనరల్ బోగీలు’, ద్వితీయ బహుమతి ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి ‘కిడ్నాప్’, తృతీయ బహుమతి విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ ప్రదర్శన నిలిచింది. అలాగే ఉత్తమ నటుడు, నటి, హాస్యనటుడు, రచన, దర్శకుడు, సంగీతం, ప్రతినాయకుడు, బాలనటుడు, ఉత్తమ ఆహార్యంతో పాటు పలు విభాగాల్లో ఎంపికై న విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు.
నాటక రంగాన్ని ప్రోత్సహించడం
అభినందనీయం
అంతరించి పోతున్న నాటక రంగానికి భారతీయ నాటక కళాసమితి జీవం పోస్తుందని, 50 ఏళ్లుగా నాటక రంగాన్ని ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. అనేక మంది కళాకారులకు వేదికగా భారతీయ నాటక కళాసమితి నిలిచిందన్నారు. భారతీయ సంస్కృతీసంప్రదాయాల పరిరక్షణ కళారంగంతోనే సాధ్యమన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే నాగరాజు తన తల్లిదండ్రుల పేరున అన్నదానం చేశారు. కళాసమితి అధ్యక్షుడు ఎండీ అప్సర్, కార్యదర్శి ఈగ సాంబయ్య, సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రదర్శనగా ‘జనరల్ బోగీలు’
బహుమతులు అందజేసిన
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Comments
Please login to add a commentAdd a comment