పొదుపు చేసుకుంటేనే ఆర్థికాభివృద్ధి
సంగెం: మహిళలు పొదుపులు చేసుకుంటే ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని ఆర్‌బీఐ లీడ్ బ్యాంకు జిల్లా అధికారి పల్లవి అన్నారు. గురువారం సంగెం మండలంలోని పల్లారుగూడలో మచ్చాపూర్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉన్నట్టుగా ఆర్థికంగా ముందుండాలన్నారు. ఏ అవసరం నిమిత్తం రుణం తీసుకున్నరో అందుకోసమే ఉపయోగించుకుని, రుణ వాయిదాలను సకాలంలో చెల్లించి సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే జీవన జ్యోతి, సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన పథకాలను అర్హత కలిగినవారు ఉపయోగించుకోవాలన్నారు. ఏటీఎం కార్డు నంబర్, సీవీవీ నంబర్ ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడితే వెంటనే 1930కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీబీ హవేలి రాజు, నోడల్ అధికారి శ్రీనివాస్, ఎఫ్‌ఎల్‌సీ కౌన్సిలర్లు ప్రేమ్‌కుమార్, భాస్కరచారి, బ్యాంకు మేనేజర్ స్వాతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌బీఐ లీడ్ బ్యాంకు
జిల్లా అధికారి పల్లవి
Comments
Please login to add a commentAdd a comment