వసంతోత్సవానికి వేళాయె..
నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ ● మార్చి 2 వరకు నిర్వహణ
● దక్షిణ భారతదేశంలోనే
అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్
● హాజరుకానున్న పలు
ఇంజనీరింగ్ కళాశాలల
విద్యార్థులు
● ప్రారంభించనున్న
హాస్యనటుడు బ్రహ్మానందం
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది మాదిరిగా విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. నేటి (శుక్రవారం) నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. నాటి ఆర్‌ఈసీ నేటి నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్‌లో వివిధ దేశాల సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకునేందుకు 1978లో ప్రారంభమైన వసంతోత్సవం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్‌గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment