
హనుమకొండ
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
7
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతీ ఏడాది మాదిరిగా విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులపాటు వసంతోత్సవం (స్ప్రింగ్ స్ప్రీ–25) నిర్వహించనున్నారు. నేటి(శుక్రవారం) నుంచి మార్చి 1, 2 తే దీల్లో నిర్వహించే కల్చరల్ ఫెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. నిట్‌లో ప్రపంచంలోని పలు ప్రాంతాల విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న ఈక్యాంపస్‌లో వివిధ దేశాల సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు 1978లో వసంతోత్సవం ప్రారంభమై.. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్‌గా పేరుగాంచింది. దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
తొలిరోజు: శుక్రవారం సాయంత్రం అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో హాస్యనటుడు, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, పద్మశ్రీ బ్రహ్మానందం విద్యార్థులతో చిట్‌చాట్.
రెండో రోజు: శనివారం ప్రోషోలో భాగంగా ఇండియన్ రాక్‌బ్యాండ్ వార్డెక్స్ ఫ్యూజన్ మ్యూజిక్‌తో అలరించనున్నారు. డైరెక్టర్ కట్స్‌లో సినీ డైరెక్టర్లతో చిట్‌చాట్. అల్యూర్‌లో భాగంగా ఫ్యాషన్ షో, నుక్కడ్ నాటక ప్రదర్శన
మూడో రోజు: ముగింపులో భాగంగా ఆదివారం పాపులర్ సింగర్ అమిత్ త్రివేది హిందీ, ఇంగ్లిష్ సంగీత విభావరి. నిపుణులతో బైక్‌స్టంట్స్.
ఈసారి థీం లేదు: స్ప్రింగ్ స్ప్రీ వేడుకలను ప్రతీ ఏడాది ప్రత్యేక థీంతో నిర్వహించేవారు. 2022లో సృష్టిగా, 2023లో కళాధ్వనిగా, 2024లో రాసంగేన్ థీం (ఇతి వృత్తం) తో నిర్వహించారు. ఈసారి అదేపేరుతో స్ప్రింగ్ స్ప్రీ–25ను నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
నేటి నుంచి నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ–25’ మార్చి 2 వరకు నిర్వహణ
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్
హాజరుకానున్న పలు ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు
ప్రారంభించనున్న హాస్యనటుడు బ్రహ్మానందం

హనుమకొండ
Comments
Please login to add a commentAdd a comment