ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షిప్రతినిధి, వరంగల్/విద్యారణ్యపురి:
ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కొనసాగింది. టీచర్లు, అధ్యాపకులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,189 మంది ఓటర్లు ఉండగా 10,401 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తంగా 92.95శాతం పోలింగ్ నమోదైంది. హనుమకొండ జిల్లాలోని 15 పోలింగ్ కేంద్రాల్లో కలిపి 5,215 మంది ఓటర్లు ఉండగా.. 4,780 మంది (91.66శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండ జిల్లా కేంద్రంలో మార్చి 3న జరగనుంది. హనుమకొండలోని యూనివర్సిటీ లా కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పోలింగ్ కేంద్రాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య పోలింగ్ సరళని పరిశీలించారు. వివిధ పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. హనుమకొండలోని యూనివర్సిటీ లా క ళాశాల పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
కేడీసీలో నాలుగు పోలింగ్ కేంద్రాలు
హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అశోక్ సెంటర్ నుంచి బస్టాండ్ రోడ్డులో ఈ కళాశాల ఉంది. కళాశాల సమీపంలో రహదారికి ఇరువైపులా కొంత దూరం వరకు అభ్యర్థుల మద్దతుదారులు టెంట్లు వేసుకొని పోలింగ్ చిట్టీలు రాసిచ్చారు. ఈ మార్గం సాధారణంగానే నిత్యం రద్దీగా ఉంటుంది. అభ్యర్థుల మద్దతుదారులు, ఓటర్లతో మరింత రద్దీగా కనిపించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. వివిధ పోలింగ్ కేంద్రాలను టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్, పులి సరోత్తంరెడ్డి, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, సుందర్‌రాజు యాదవ్, యోల చంద్రమోహన్ వేర్వేరుగా సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.
పట్టభద్రుల్లో కొరవడిన చైతన్యం
పట్టభద్రుల్లో చైతన్యం కొరవడడంతో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. హనుమకొండ జిల్లాలోని నాలుగు మండలాలైన భీమదేవరపెల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, వేలేరు మండలాల్లో 4,585 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా.. 1,780 మంది ఓటర్లు (38.82శాతం) ఓటు వేశారు.
పరిశీలించిన సీపీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను సీపీ అంబర్ కిషోర్ ఝా సందర్శించారు. హసన్‌పర్తి, ఎల్కతుర్తి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లపై ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ జిల్లాలో..
సాక్షి, వరంగల్ : వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 2,352 మంది ఓటర్లకు గానూ 2,214 మంది (94.13 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. సెంట్రల్ డీసీపీ షేక్ సలీమాతో కలిసి వరంగల్ పట్టణంలోని ఇస్లామియా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
శాయంపేటలో పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేస్తున్న సిబ్బంది
హనుమకొండ, వరంగల్ జిల్లాలో
ఉత్సాహంగా ఓటేసిన
ఉపాధ్యాయులు
నల్లగొండలోని స్ట్రాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్సుల తరలింపు
పలు కేంద్రాలను పరిశీలించిన
జిల్లా ఎన్నికల అధికారులు, సీపీ
ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ వివరాలు..
జిల్లా ఓటర్లు పోలైనఓట్లు శాతం
జనగామ 1,002 945 94.31
హనుమకొండ 5,215 4,780 91.66
వరంగల్ 2,352 2,214 94.13
మహబూబాబాద్ 1,663 1,571 94.47
జేఎస్ భూపాలపల్లి 329 308 93.62
ములుగు 628 583 92.83
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
ప్రశాంతంగా ‘ఎమ్మెల్సీ’ పోలింగ్
Comments
Please login to add a commentAdd a comment