ఘనంగా రుద్రేశ్వరుడి నాగవెల్లి
హన్మకొండ కల్చరల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామి రుద్రేశ్వరీ అమ్మవారికి బుధవారం రాత్రి కల్యాణం నిర్వహించారు. మూడో రోజు గురువారం నాగవెల్లి నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ, అర్చకుడు సందీప్, ప్రణవ్ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నూతనవస్త్రాలతో అలంకరించి పూజలు చేశారు. వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.
నేడు అన్నపూజ..
శుక్రవారం ఉదయం రుద్రేశ్వరస్వామికి 51 కిలోల పెరుగన్నంతో అన్నపూజ, అనంతరం భక్తులకు మహాన్నదానం జరుగుతుందని ఆలయ ఈఓ అనిల్‌కుమార్ తెలిపారు.
తెలుగు బీఓఎస్ చైర్మన్‌గా
శంకరయ్య
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఇన్‌చార్జ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంథిని శంకరయ్య నియమితులయ్యారు. ఈమేరకు గురువారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో తెలుగు విభాగం బీఓఎస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ ఏటూరు జ్యోతి మృతి చెందడంతో వేకెన్సీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆస్థానంలో శంకరయ్యను నియమించారు. ఉత్తర్వులను వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి చేతుల మీదుగా శంకరయ్య అందుకున్నారు.
నాటక పోటీల విజేతలకు
బహుమతుల ప్రదానం
హన్మకొండ కల్చరల్: హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సహృదయ సంస్థ ఆధ్వర్యంలో నాలుగురోజులుగా నిర్వహించిన తెలుగు భాష ఆహ్వాన నాటక పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బుధవారం రాత్రి 11 గంటలకు సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో నాటక పోటీల విజేతలకు అందించారు. గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చిగురు మేఘం’ నాటకానికి మొదటి, కొలకలూరుకు చెందిన శ్రీసాయి ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ నాటకానికి ద్వితీయ బహుమతి అందించారు. ఉత్తమ నటుడు, నటి, క్యారెక్టర్ నటుడు, హాస్యనటుడు, రచన, దర్శకుడు, సంగీతం, రంగాలంకరణ తదితర విభాగాల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సహృదయ సభ్యులు మల్యాల మనోహర్, కుందావజ్జుల కృష్ణమూర్తి, వనం లక్ష్మీకాంతారావు, ఎన్వీఎన్ చారి, జూలూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా రుద్రేశ్వరుడి నాగవెల్లి
ఘనంగా రుద్రేశ్వరుడి నాగవెల్లి
Comments
Please login to add a commentAdd a comment