సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవాలి
● అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనంలో కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ: రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలతో పాటు రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ–కేరళ అంతర్రాష్ట్ర యువజన సమ్మేళనం జరిగింది. ఈకార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ పి.ప్రావీణ్య జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల వారు ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు. కేరళ యువత తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, కేరళ సంస్కృతీ సంప్రదాయాలను ఇక్కడి యువత తెలుసుకోవాలని సూచించారు. తాను కూడా కేరళ రాష్ట్రాన్ని పలుమార్లు సందర్శించానని కలెక్టర్ గుర్తు చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన కేరళ యువతకు డ్రెస్, టోపీలతో కూడిన కిట్లను ఆమె అందించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేశ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment