ఎల్కతుర్తి: మండలంలోని సూరారం గ్రామ శివారు సింగరాయ విశ్వేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలు అంబరాన్నంటాయి. గురువారం తెల్లవారుజామున అగ్ని గుండాల ప్రవేశం జరిగింది. జాగారం చేసిన భక్తులు దేవదేవున్ని తలుస్తూ నిప్పులపై నడిచి భక్తిని చాటుకున్నారు. మండల కేంద్రంలోని వీరభద్రస్వామి శివాలయంలో అన్నపూజ జరిగింది. నెయ్యి, తేనె, పెరుగన్నం కలిపిన నైవేద్యంతో శివలింగాన్ని అలంకరించారు. అర్చకులు ప్రత్యేక పూజలు పూర్ణాహుతి, కుంకుమాభిషేకం, అన్నపూజ నిర్వహించారు. మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా జరిగిన శివకల్యాణం అనంతరం ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరులను వాహనంపై ఎక్కించి గ్రామ పర్యటన నిర్వహించారు. దీంతో భక్తులు కొబ్బరికాయలు సమర్పించి స్వామివారికి మొక్కులు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment