
సమష్టి అవగాహన, కఠిన చర్యలు అవసరం
రమ్మీ యాప్‌ల ప్రభావం ఊహించలేనంత భయంకరంగా ఉంది. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగులు.. ఇలా ఎవరికీ మినహాయింపు లేకుండా ఉంది. ఈ చీకటి ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే ప్రతీ విద్యాసంస్థలో సైబర్ క్రైమ్‌పై అవగాహన, మానసిక, ఆరోగ్య సదస్సులు నిర్వహించాలి. మండల స్థాయిలో మోసపోయిన యువత పునరావాసం కోసం ‘డిజిటల్ బాధితుల కమిటీ’ ఏర్పాటు చేయాలి. ఎవరు యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారో గుర్తించి న్యాయపరంగా వారిపై కేసులు నమోదు చేయాలి. ముఖ్యంగా విద్యాశాఖ, పోలీస్ వ్యవస్థ, న్యాయ శాఖ, మానసిక ఆరోగ్య సంస్థలు సమష్టిగా పనిచేయాలి.
– బి.కేశవులు, సీనియర్ మానసిక వైద్య నిపుణుడు