కిటకిటలాడిన శ్రీవారి క్షేత్రం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామికి ప్రీతికరమైన రోజు, అందులోను కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు క్షేత్రానికి విచ్చేశారు. తెల్లవారుజాము నుంచి భక్తులు రాక ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment