ధాన్యంనిల్వలోమెలకువలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యంనిల్వలోమెలకువలు

Published Sun, Nov 24 2024 12:20 AM | Last Updated on Sun, Nov 24 2024 12:20 AM

ధాన్య

ధాన్యంనిల్వలోమెలకువలు

చింతలపూడి/దెందులూరు: ఖరీఫ్‌ మాసూళ్ళు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంటికి వచ్చిన ధాన్యాన్ని ఎలా భద్రపరుచుకోవాలో తెలియక రైతులు తికమక పడుతుంటారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని భద్రపరుచుకోడం రైతులకు సవాల్‌ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పండించిన పంటలో 10 నుండి 20 శాతం నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బి.నాగకుమార్‌. ధాన్యం నిల్వ చేసుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన రైతులకు వివరించారు. ధాన్యం నూర్చిన తరువాత ఇంటి అవసరాలు, విత్తనాలకు కలిపి సుమారు ఏడాదికి పైగా భద్రపరచాల్సి ఉంటుంది. దీంతో ధాన్యం రంగు, రుచి తగ్గుతుంది. సాధారణంగా వరి కోతల సమయంలో ధాన్యంలో 20 శాతం తేమ ఉంటుంది. కోసిన తరువాత వరి పనలను ఆరబెట్టడం వల్ల 4 నుంచి 6 శాతం తేమ తగ్గవచ్చు. ధాన్యంలో 14 శాతానికి మించి తేమ ఉంటే బూజు పట్టే అవకాశాలు ఉంటాయి. నిల్వ చేసే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కీటకాలు ఆశించి నష్టం కలుగజేస్తాయి. అంతేకాక ఎలుకలు ధాన్యాన్ని తినడమే కాక, వాటి విసర్జనలతో కలుషితమయ్యే ప్రమాదం ఉంది. నిల్వ ఉంచిన ధాన్యాన్ని నష్టపరిచే కీటకాల విషయానికి వస్తే..

ముక్క పురుగు

పంట కోయడానికి ముందు నుంచే ముక్క పురుగు నష్టం కలిగిస్తుంది. బియ్యంలో తెల్లని పురుగులుగా కనిపించేవి లార్వా దశలో ఉన్న ఈ పురుగులే. తల్లి కీటకం వడ్ల గింజకు చిన్న రంధ్రం చేసి అందులో గుడ్లు పెట్టి తన నోటి నుండి వెలువడే కొవ్వు పదార్ధంతో రంధ్రాన్ని మూసి వేస్తుంది. ప్రౌడ దశలోని ముక్క పురుగు గింజ లోపల బియ్యం తింటూ నష్టం కలిగిస్తుంది.

వడ్ల చిలుక

ధాన్యానికి వడ్ల చిలుక ఆశిస్తే దాన్యం చెడు వాసన వస్తుంది. తల్లి కీటకం వడ్ల గింజలపై గుంపులుగా చేరి గుడ్లు పెడుతుంది. గుడ్లు పగిలి లార్వా గింజ లోపలికి తొలుచుకుని పోయి బియ్యపు గింజను తింటుంది. అనంతరం ప్యూపా దశ చేరక ముందే పై పొట్టులో చిన్న రంధ్రం చేస్తుంది. ప్రౌడ దశకు చేరిన తరువాత ఆ రంధ్రం ద్వార వడ్ల చిలుక బయటికి వస్తుంది. ఇది వడ్ల మూటలు, గిడ్డంగులపై కనిపిస్తుంది.

నుసి పురుగు

దీనినే పుచ్చ పురుగు లేదా పెంకు పురుగు అంటారు. ఇది గొట్టపు ఆకారంలో చాలా చిన్నదిగా 3 మి.మీ పొడవు ఉంటుంది. ధాన్యం గింజలకు నష్టం కలిగిస్తుంది. ఇది ప్రారంభ దశలో చెత్తను, ఆ తరువాత గింజపై పొరను, ఆ తర్వాత లోపలి బియ్యపు గింజను తిని తీవ్ర నష్టం కలిగిస్తుంది.

ధాన్యం నిల్వ చేసే పద్దతి

రైతులు తక్కువ ధాన్యం నిల్వ చేసుకోవాలంటే వెదురు గాదెలు, సిమెంటు గాదెలు, లోహపు గాదెల ద్వార నిల్వ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలనుకుంటే గోదాంలు లేదా గిడ్డంగులను సిమెంటు కాంక్రీటుతో నిర్మించుకుంటే పూర్తి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా కీటకాలు, తేమ, వర్షపు నీరు లోనికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలుక కన్నాలు ఉంటే గాజు ముక్కలు, సిమెంటుతో పూడ్చి వేయాలి. ధాన్యం నిల్వలో కొత్త గోనె సంచులు ఉపయోగించాలి. గోనె సంచులపై, లోపల మలాథియాన్‌ లేదా ఎండోసల్ఫాన్‌ ద్రావణం స్ప్రే చేయాలి. మరునాడు సంచులను ఎండలో పెట్టాలి.

ఎలుకల నివారణకు చర్యలు

ధాన్యం గిడ్డంగి చుట్టూ చెత్త లేకుండ రోజూ శభ్రం చేస్తుండాలి. వివిధ రకాలైన బోనులు, బుట్టలను ఉపయోగించి ఎలుకలను నిర్మూలించాలి. గిడ్డంగి తలుపుల కింది భాగాలకు జింక్‌ రేకులు అమర్చాలి. రంధ్రాలకు వైర్‌ మెస్‌ మూతలు అమర్చాలి.

పాడి–పంట

No comments yet. Be the first to comment!
Add a comment
ధాన్యంనిల్వలోమెలకువలు 1
1/2

ధాన్యంనిల్వలోమెలకువలు

ధాన్యంనిల్వలోమెలకువలు 2
2/2

ధాన్యంనిల్వలోమెలకువలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement