400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం శివారు అటవీప్రాంతంలో శనివారం ఎకై ్సజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం దాడి చేశారు. దాడిలో 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎస్సై కె.శ్రీనుబాబు తెలిపారు. అనంతరం కామయ్యపాలెంలో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కలిగించారు.
నాటుసారా విక్రేత పట్టివేత
ముసునూరు : అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించి, సారా విక్రయిస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు నూజివీడు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ ఏ.మస్తానయ్య తెలిపారు. శనివారం సాయంత్రం మండలంలోని సూరేపల్లికి చెందిన చల్లారి ప్రియాంక నాటుసారా అమ్ముతుందనే సమాచారంతో సోదాలు నిర్వహించారు. రెండు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా నల్ల బెల్లం కలిగి ఉన్నా, మద్యం, నాటుసారా విక్రయాలు, బెల్ట్‌షాపులు నిర్వహిస్తే దాడులు జరిపి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎకై ్సజ్ అధికారుల దాడి
చింతలపూడి: చింతలపూడి ప్రొహిబిషన్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని పోతునూరులో నాటు సారా స్ధావరాలపై ఎకై ్సజ్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో గ్రామానికి చెందిన చేకు ఆంజనేయులు నుంచి లీటర్ నాటు సారా స్వాధీన చేసుకున్నారు. చింతలపూడి మండలం శివపురం గ్రామంలో బెల్ట్ షాపు కేసులో ముద్దాయి కంచెర్ల మహాలక్ష్మిని చింతలపూడి తహసీల్దార్ ముందు హాజరుపరచి బైండోవర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాటు సారా, గంజాయి, డ్రగ్స్‌పై నాగిరెడ్డిగూడెం గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించి వారితో ప్రమాణాలు చేయించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment