సైబర్ నేరగాళ్లకు చెక్
ఏలూరు టౌన్ : ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన వేదాంతి రామానుజాచారి ఫోన్‌ను దొంగిలించిన దుండగులు ఆయన ఖాతాలోని డబ్బును కాజేశారు. వెంటనే ఏలూరు సైబర్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయటంతో డబ్బు రికవరీ చేశారు. దీంతో రామానుజాచారి ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్‌ను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వన్‌టౌన్‌కు చెందిన రామానుజాచారి ఫోన్ దొంగిలించిన దుండగులు అందులో సేవ్ చేసిన పాస్‌వర్డ్, యూజర్‌నేమ్‌తో బ్యాంకు ఖాతాలోని రూ.3.14 లక్షలు కాజేయడం ప్రారంభించారు. విషయాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్‌సెల్ ఎస్సై మధు వెంకట రాజా దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు అధికారుల సహకారంతో బాధితుడి ఖాతాను, నగదు ట్రాన్స్‌ఫర్ చేసిన ఖాతాలను ఫ్రీజ్ చేశారు. బాధితుడి ఖాతాలో ఇంకా రూ.2.81 లక్షల నగదు ఉంది.
కాలువలో పడి వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం రూరల్: మండలంలోని కేతవరంలో ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు హెచ్‌సి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చాగంటి రమేష్(40) ఈ నెల 22న కట్టెలు తీసుకొస్తానని బయటకు వెళ్లాడు. రాత్రి కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. శనివారం గ్రామంలోని కాలువ వద్ద రమేష్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment