అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
భీమవరం: పోలీసు శాఖ సమష్టిగా పనిచేసి నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయాలని విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. శనివారం భీమవరంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని ముఖ్యమైన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. రోడ్ సేఫ్టీ, సైబర్ మోసాలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ పెంచడం ద్వారా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సులభతరమవుతుందని చెప్పారు .సమావేశంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) వి.భీమారావు, ఆర్మ్‌ర్‌డ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం డీఎస్పీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment